Page Loader
కోలీవుడ్ లో విషాదం: శివపుత్రుడు నిర్మాత వీఏ దురై కన్నుమూత 
నిర్మాత వీఏ దురై కన్నుమూత

కోలీవుడ్ లో విషాదం: శివపుత్రుడు నిర్మాత వీఏ దురై కన్నుమూత 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 03, 2023
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత వీఏ దురై 59ఏళ్ళ వయసులో చెన్నైలోని వలసరవాక్ లోని తన నివాసంలో కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వీఏ దురై, ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. వీఏ దురై నిర్మాతగా చాలా సినిమాలు చేసారు. విక్రమ్, సూర్య నటించిన శివ పుత్రుడు సినిమాకు ఆయనే నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాలోని నటనకు విక్రమ్ కి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. రజనీకాంత్, సత్యరాజ్ వంటి హీరోలతోనూ వీఏ దురై సినిమాలు చేసారు. సినిమాలు మానేసిన తర్వాత ఆర్థికంగా చాలా కష్టాలు అనుభవించారు వీఏ దురై. గతంలో హీరో సూర్య, వీఏ దురైకి సాయం చేసారు కూడా.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వీఏ దురై మరణంపై ట్వీట్