
చిరంజీవితో సినిమాలు తీసిన నిర్మాత ముఖేష్ ఉద్దేశి కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
గతకొన్ని రోజులుగా చలన చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రముఖ నిర్మాత, చిరంజీవితో సినిమాలను నిర్మించిన ముఖేష్ ఉద్దేశి కన్నుమూసారు.
గతకొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ముఖెష్ ఉద్దేశి, సెప్టెంబర్ 11న మరణించారు. అయితే మరణవార్త ఆలస్యంగా బయటకు వచ్చింది.
మరికొద్ది రోజుల్లో కిడ్నీ ట్రాన్ ప్లాంటేషన్ సర్జరీ జరుగుతుందనగా, ముఖేష్ ఉద్దేశి ఈ లోకాన్ని విడిచిపోయారు. చిరంజీవి నటించిన ఎస్పీ పరశురాం చిత్రానికి సహ నిర్మాతగా ముఖేష్ ఉద్దేశి ఉన్నారు.
అంతేకాదు, చిరంజీవి హిందీలో రూపొందించిన ప్రతిబంధ్, జెంటిల్ మెన్ సినిమా నిర్మాణంలో ముఖేష్ ఉద్దేశి భాగస్వామ్యం ఉంది.
Details
అల్లు అరవింద్ తో కలిసి పనిచేసిన ముఖేష్ ఉద్దేశి
గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తో కలిసి నిర్మాణ భాగస్వామిగా ముఖేష్ ఉద్దేశి చాలా సినిమాలను తెరకెక్కించారు.
తెలుగులోనే కాదు హిందీలో, కున్వారా, కౌన్, కలకత్తా మెయిల్ చిత్రాలను నిర్మించారు.
ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకులు రూపొందించిన గో గోవా గాన్ చిత్రంలో ముఖేష్ ఉద్దేశి పాలు పంచుకున్నాడు.
లైన్ ప్రొడ్యూసర్ గా మారిన ముఖేష్ ఉద్దేశి, బ్రేక్ కే బాద్, షాకీన్స్, కిడ్నాప్, సారీ భాయ్, ఛష్మే బద్దూర్ వంటి చిత్రాలకు పని చేసారు.
ముఖేష్ మరణంపై ఇటు టాలీవుడ్ సెలెబ్రిటీలు, అటు బాలీవుడ్ సెలెబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.