Page Loader
టాలీవుడ్ లో విషాదం: సూపర్ హిట్ చిత్రాల నిర్మాత గోగినేని ప్రసాద్ కన్నుమూత 
గోగినేని ప్రసాద్ కన్నుమూత

టాలీవుడ్ లో విషాదం: సూపర్ హిట్ చిత్రాల నిర్మాత గోగినేని ప్రసాద్ కన్నుమూత 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 14, 2023
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

చలన చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నిర్మాత ముఖేష్ ఉద్దేశి మరణించిన రెండు రోజులకే మరో నిర్మాత కన్నుమూసారు. షిర్డీ సాయిబాబా మహత్యం, ఈ చరిత్ర ఏ సిరాతో, పల్నాటి పులి వంటి చిత్రాల నిర్మాత గోగినేని ప్రసాద్(73) నిన్న సాయంత్రం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో భాధపడుతున్న గోగినేని ప్రసాద్, నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని కొండాపూర్ లో తన నివాసంలో చివరి శ్వాస విడిచారు. గోగినేని ప్రసాద్ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులు తెలియజేసారు.

Details

మహాప్రస్థానంలో అంత్యక్రియలు 

గోగినేని ప్రసాద్ మరణంతో ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మరణంపై సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. గోగినేని ప్రసాద్ కి ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అమెరికాలో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. ప్రసాద్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లో మహాప్రస్థానంలో ఈరోజు మధ్యాహ్నం జరగనున్నాయి. అంత్యక్రియలకు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.