Renu Desai: ధనుష్‌కు క్షమాపణలు చెప్పిన రేణూ దేశాయ్.. అసలు కారణం ఏమిటంటే?
ఈ వార్తాకథనం ఏంటి
నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, కాస్ట్యూమ్ జైనర్‌గా.. ఇలా సినిమా రంగంలోని విభిన్న విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు రేణూ దేశాయ్. కెరీర్ ప్రారంభంలో 'బద్రి', 'జానీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె.. పెళ్లి, పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే పిల్లలు పెద్దవారు కావడంతో మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. అలా 2023లో రవితేజ హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో హేమలతా లవణం అనే సామాజిక సంస్కర్త పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో రేణూ దేశాయ్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతారని అందరూ భావించారు.
వివరాలు
'ఓం' సినిమాలో కీలక పాత్ర
కానీ ఆ తర్వాత ఆమె నుంచి మరో సినిమా రాలేదు. ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి వెండితెరపై కనిపించేందుకు సిద్ధమయ్యారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన 'ఓం చాప్టర్ 1' (O.M) సినిమాలో రేణూ దేశాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
శ్రీలీల, సాయి పల్లవి కథానాయికలుగా నటించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో సోమవారం (నవంబర్ 16) హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
వివరాలు
ధనుష్‌కు క్షమాపణలు చెప్పిన రేణూ దేశాయ్
ఈ కార్యక్రమానికి హీరో ధనుష్, మమ్ముట్టితో పాటు చిత్ర బృందం మొత్తం హాజరైంది. రేణూ దేశాయ్ తన కుమార్తె ఆద్యతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మొదట ధనుష్‌కు క్షమాపణలు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రీ రిలీజ్ వేడుకలో రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. ''ధనుష్ సర్.. నాకు తమిళం సరిగ్గా మాట్లాడటం రాదు.
షూటింగ్ సమయంలో నేను మాట్లాడిన తమిళంలోని తప్పులను చాలా ఓపికగా భరించినందుకు మీకు ధన్యవాదాలు.
కొన్నిసార్లు ఈమెకు తమిళం సరిగ్గా మాట్లాడటం ఎందుకు రావడం లేదని మీకు అనిపించి ఉండవచ్చు. అందుకు నన్ను క్షమించండి'' అని అన్నారు.
వివరాలు
శివరాత్రి రోజు సినిమా నుంచి ఫోన్ కాల్
తమిళంలో డైలాగులు చెప్పేటప్పుడు తాను చేసిన పొరపాట్లను ధనుష్ ఎంతో సహనంతో అర్థం చేసుకుని సహకరించారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
భాష విషయంలో తనకు ఎదురైన ఇబ్బందులను ప్రస్తావిస్తూ ధనుష్‌కు క్షమాపణలు చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి.
ఇక 'ఓం' సినిమా గురించి మాట్లాడుతూ రేణూ దేశాయ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ''ఈ ఏడాది శివరాత్రి రోజున నాకు ఈ సినిమా టీమ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
ఆరోజు నేను కామాఖ్య ఆలయంలో ఉన్నాను. శివరాత్రి, కామాఖ్య ఆలయం, ఓం సినిమా.. ఈ మూడు చాలా పవర్‌ఫుల్ కాంబినేషన్. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
వివరాలు
చాలా భయం వేసింది
మమ్ముట్టి వంటి గొప్ప నటుడి ముందు నిలబడి డైలాగులు చెప్పాలంటే తనకు చాలా భయం వేసిందని రేణూ దేశాయ్ తెలిపారు. ''నాకు నటించడం రాదు.
అలాంటిది మమ్ముట్టి గారి ముందు నిలబడి డైలాగులు చెప్పడం అంటే చాలా భయం వేసింది.
నవంబర్ 20న మీరందరూ థియేటర్లకు వచ్చి నేను ఎలా నటించానో మీరే చెప్పాలంటూ ప్రేక్షకులను కోరారు.