Loading...
Kashi Majili Trailer: రేణూదేశాయ్‌ కొత్త ప్రాజెక్టు.. 'కాశీ మజిలీ' ట్రైలర్‌ రిలీజ్

Kashi Majili Trailer: రేణూదేశాయ్‌ కొత్త ప్రాజెక్టు.. 'కాశీ మజిలీ' ట్రైలర్‌ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2026
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో చివరిసారిగా తెరపై కనిపించారు రేణూదేశాయ్‌ (Renu Desai). దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రతి ఆదివారం ఈటీవీ విన్‌ (ETV Win) 'కథాసుధ'ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూపొందిన 'కాశీ మజిలీ' చిత్రంలో రేణూదేశాయ్‌ ప్రధాన పాత్రలో నటించారు. 'కొన్ని ప్రేమకథలకు మరో అవకాశం దక్కాలి' అనే థీమ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యమున కిశోర్‌ దర్శకత్వం వహించిన 'కాశీ మజిలీ' సెప్టెంబరు 13న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం విడుదల చేసిన ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్‌లోని సంభాషణలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ADVERTISEMENT