Dhurandhar 2: 'ధురంధర్ 2' చూసిన రేణూ దేశాయ్.. మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుత ట్రెండ్‌ను చూస్తుంటే ఈ సినిమా రూ.2000 కోట్ల మార్క్‌ను సులభంగా దాటేస్తుందన్న అభిప్రాయాలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణ్‌వీర్ సింగ్ పేర్లు మరోసారి సోషల్ మీడియాలో మార్మోగుతున్నాయి.
వివరాలు
సెలబ్రిటీల ప్రశంసలు
సినిమాపై సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. పలువురు థియేటర్లకు వెళ్లి చిత్రాన్ని వీక్షించి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి సహా పలువురు 'ధురంధర్ 2'ను అభినందించారు.
వివరాలు
రేణూ దేశాయ్ ఆసక్తికర పోస్టులు
తాజాగా నటి రేణూ దేశాయ్ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఈ చాయ్‌వాలా భారతదేశానికి వచ్చినప్పటి నుంచి మన ప్రజలలో భయం పెరిగిందంటూ సినిమాలో బడే సాహెబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీం చెప్పే డైలాగ్‌కు సంబంధించిన రీల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. తన పోస్టుకు 'చాయ్‌వాలా జల్వా' అని క్యాప్షన్ ఇస్తూ, నేను బీజేపీకి, మన అద్భుతమైన పీఎం మోదీజీకి గర్వించదగిన అంధ భక్తురాలిని అని పేర్కొన్నారు.
వివరాలు
సైన్యం, దేశభక్తిపై వ్యాఖ్యలు
ఇంకా తన పోస్టుల్లో ఆమె ఇలా పేర్కొన్నారు: దేశ సాయుధ దళాలు, నిఘా సంస్థల పట్ల గౌరవం ఉండాలని, వారి వల్లే ప్రజలు సురక్షితంగా జీవిస్తున్నారని చెప్పారు. దేశం గురించి అవగాహన లేకుండా మాట్లాడేవారు 'ధురంధర్ 1 & 2' సినిమాలు చూడాలని సూచించారు. "ధర్మాన్ని పాటించడమే కర్తవ్యం, ఫలితాన్ని ఆశించకూడదు. విజయ వాగ్దానాలకు మోసపోకండి. యుద్ధభూమి పిలుస్తోంది.. ధైర్యంగా ముందుకు సాగండంటూ ఆమె తన పోస్టుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.