Page Loader
Dragon Telugu Trailer: 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ట్రైలర్ విడుదల.. ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్!
'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ట్రైలర్ విడుదల.. ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్!

Dragon Telugu Trailer: 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ట్రైలర్ విడుదల.. ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 11, 2025
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రదీప్ రంగనాథన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'లవ్ టుడే' సినిమాతో తమిళంతో పాటు తెలుగు ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకున్న ఈ యంగ్ డైరెక్టర్-యాక్టర్, ఇప్పుడు 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అనే సినిమాతో రాబోతున్నాడు. ఏజీఎస్ బ్యానర్‌పై అఘోరం, గణేష్, సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి 'ఓరి దేవుడా' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 21న ఈ సినిమా విడుదల కానుండగా, తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేస్తున్న ఈ చిత్రాన్ని కోస్తాంధ్రలో పూర్వీ పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా అన్ని ఎలిమెంట్స్ జోడించారు.

Details

  ఫుల్ ఎంటర్టైనర్ గా ట్రైలర్

యూత్‌కి కావాల్సిన వినోదం, ప్రేమ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నింటినీ మేళవించారు. హీరో ఇంజనీరింగ్‌లో 48 బ్యాక్‌లాగ్‌లు పెట్టుకున్న యువకుడిగా కనిపించాడు. ఈ చిత్రంలో కె.యస్. రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ వంటి ప్రముఖ దర్శకులు ముఖ్యపాత్రలు పోషించడం విశేషం. అలాగే వి.జె. సిద్ధు, హర్షత్ ఖాన్, మరియం జార్జ్, ఇందుమతి మణికందన్, తేనప్పన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వీడియో, టీజర్, పాటలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ఫిబ్రవరి 21న ఈ చిత్రం భారీ ఎత్తున థియేటర్లలో సందడి చేయనుంది. ప్రదీప్ రంగనాథన్ మరోసారి మాస్ ఆడియెన్స్‌ను మెప్పించాడా? అనే విషయాన్ని చూడాలి!