
Keedaa Cola Movie Review : రివ్యూ : తరుణ్ భాస్కర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో దర్శకుడు తరుణ్ భాస్కర్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.
అతను తెరకెక్కించిన తాజా చిత్రం 'కీడాకోల'.
చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, జీవన్ కుమార్, తరుణ్ భాస్కర్, విష్ణు, రవీంద్ర విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా నేడు(నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా ప్రేక్షకులను అకట్టుకుందో లేదో చూద్దాం.
క్రైమ్ కథాంశంతో కీడా కోలాను తెరకెక్కించినా, నవ్వించడమే మెయిన్ టార్గెట్ పెట్టుకొని ఈ సినిమాను రూపొందించారు.
కూల్‌డ్రింక్‌లలో పురుగులు వంటి న్యూస్‌లు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఈ ఘటన ఆధారంగా కథను రాశారు.
Details
ఆకట్టుకున్న బ్రహ్మనందం పాత్ర
వాస్తు, వరదరాజు పాత్రల పరిచయం, వాస్తుపై ఉన్న కోర్టు కేసు అంశాలతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది.
ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోనే కామెడీ బాగుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
వీల్ చెయిర్‌కు పరిమితమైన పాత్రలో కనిపించి కామెడీని పండించాడు. ఇక చైతన్యరావును తరుణ్ భాస్కర్ కొత్తగా చూపించారు.
మొత్తానికి కీడా కోలా సినిమా లాజిక్స్ గురించి ఆలోచించకుండా చూస్తే ఈ చిత్రం వినోదాన్ని పంచుతుంది.