Atharva Movie Review: అథర్వ మూవీ రివ్యూ.. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన 'అథర్వ' మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి జంట నటించిన ఈ సినిమాకు మహేశ్వరరెడ్డి దర్శకత్వం వహించాడు. ట్రైలర్, టీజర్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. దేవ్ అథర్వ కర్ణ( కార్తిక్ రాజు) అస్తమా కారణంగా పోలీసు కావాలని కల తీరదు. చివరికి క్లూస్ టీంలో జాయిన్ అవుతాడు. ఈ క్రమంలో నిత్య అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఇక నిత్య ఫ్రెండ్ జోష్ని హత్యకు గురవుతుంది. బాయ్ ఫ్రెండ్ శివనే చంపి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తారు. కానీ వారిది ఆత్మహత్య కాదు హత్య అని నిత్య అనుమానపడుతుంది. ఆమె అనుమానం నిజమైందా?
కర్ణగా అథర్వ నటన అద్భుతం
ఒక క్లూ కూడా లేని ఈ కేసును శివ ఎలా చేధిస్తాడో చూడాలంటే ఈ సినిమా చూడాల్సిందే. క్లూస్ టీం బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉన్న మిగిలిన కథ చాలా వరకు రోటీన్ గానే ఉంది.కర్ణగా అథర్వ నటన అద్భుతంగా ఉంది. ఇక సిమ్రాన్ చౌదరి గ్లామర్‌తో మెప్పించింది. శ్రీచరణ్ పాకాలా మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. కథ, బ్రాక్ డ్రాప్, కొన్ని మలుపులతో ఈ సినిమాను డైరక్టర్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారిని ఈ అథర్వ మూవీ మెప్పిస్తుంది.