LOADING...
The Raja Saab : ప్రభాస్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. మూడేళ్ల తర్వాత బయటపెట్టిన రిద్ది 
ప్రభాస్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. మూడేళ్ల తర్వాత బయటపెట్టిన రిద్ది

The Raja Saab : ప్రభాస్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. మూడేళ్ల తర్వాత బయటపెట్టిన రిద్ది 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2025
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్, మారుతి జంటలో రాబోతున్న 'ది రాజాసాబ్' సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. కామెడీ-హారర్-థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రుధ్ది కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, హీరోయిన్ రిద్ధి కుమార్ అందరి దృష్టిని ఆకర్షించారు. స్టేజ్‌పై మాట్లాడుతూ, ఆమె ప్రభాస్ ఇచ్చిన ప్రత్యేక బహుమతి గురించి ప్రస్తావించింది. ఈవెంట్‌లో ఆమె ధరించిన వైట్ కలర్ చీరను ప్రభాస్ మూడేళ్ల క్రితం గిఫ్ట్ ఇచ్చారని తెలిపింది.

Details

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు

ప్రభాస్, నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్‌కు చాలా థ్యాంక్స్. ఈ చీరను నువ్వు మూడు సంవత్సరాల క్రితం ఇచ్చావు. ఈ ప్రత్యేకమైన వేడుకలో ధరించాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లు జాగ్రత్తగా దాచుకున్నానని పేర్కొంది. ఇక రిద్ధి ప్రభాస్‌ను 'సార్' అని కాకుండా నేరుగా 'ప్రభాస్' అని పిలవడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొందరు దీనిని ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కారణంగా అర్ధం చేసుకుంటున్నారు, మరికొందరు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రిద్ధి కుమార్ ప్రభాస్‌తో రెండో సినిమా ఇది. ఆమె గతంలో 'రాధే శ్యామ్' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

Advertisement