Rinky Chakma: 28ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మాజీ 'మిస్ ఇండియా త్రిపుర' మృతి
ఈ వార్తాకథనం ఏంటి
2017లో మిస్ ఇండియా త్రిపుర కిరీటాన్ని గెలుచుకున్న రింకీ చక్మా కన్నుమూశారు. ఆమె వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే.
రింకీ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆమెకు గత రెండేళ్లుగా చికిత్స తీసుకుంటోంది.
పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 22 న దిల్లీలోని మాక్స్ ఆసుపత్రిలో రింకీ చక్మా చేరింది. అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
2022 సంవత్సరంలో రింకీకి ప్రాణాంతక ఫైలోడ్స్ ట్యూమర్ (రొమ్ము క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీని కోసం ఆమె శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు.
అయితే క్యాన్సర్ తీవ్ర రూపం దాల్చింది. మెటాస్టాసిస్ దశకు చేరుకోవడంతో అది మొదట రింకీ ఊపిరితిత్తులకు, ఆ తర్వాత మెదడుకు చేరింది.
రింకీ
క్యాన్సర్ చికిత్స కారణంగా ఆర్థికంగా చితికిపోయిన రింకీ కుటుంబం
క్యాన్సర్‌తో పోరాడిన అనుభవాన్ని రింకీ సోషల్ మీడియాలో పంచుకుంది.
ఈ వ్యాధి తన శరీరాన్ని అలాగే తన కుటుంబాన్ని ఆర్థికంగా ఎలా దెబ్బతీసింది అని ఇందులో చెప్పింది. అంతేకాకుండా, సోషల్ మీడియా ద్వారా సహాయం కోసం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఎందుకంటే ఆమె కుటుంబం రెండేళ్లలో చికిత్స సమయంలో ఉన్న డబ్బంతా ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఆమె సాయం కోసం అభ్యర్థించింది.
ఇటీవల రింకీ చక్మా పరిస్థితి క్షీణించడంతో వైద్యులు కీమోథెరపీని కూడా నిలివేశారు. చివరికి దిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు.