LOADING...
Kantara Chapter 1: ఛావా రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ శెట్టి.. కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న 'కాంతార చాప్టర్ 1'
ఛావా రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ శెట్టి.. కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న 'కాంతార చాప్టర్ 1'

Kantara Chapter 1: ఛావా రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ శెట్టి.. కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న 'కాంతార చాప్టర్ 1'

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిషబ్ శెట్టి హీరోగా నటించిన 'కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1' ఇప్పుడు థియేటర్లలో జోరు గల ఫీలింగ్‌తో దూసుకుపోతుంది. ఈ 2025 లో విడుదలైన పెద్ద సినిమాల్లో ఒకటిగా నిలిచింది. పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అద్భుతమైన విజువల్స్, బీజీఎమ్, నటీనటుల యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసాయి. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాంతార చాప్టర్ 1 ఇప్పటికే రూ. 818 కోట్లు వసూలు చేసింది. ఇది విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన 'ఛావా' సినిమా కలెక్షన్లను (రూ. 807 కోట్లు) అధిగమించింది. 2025 అక్టోబర్ 24న భారత్‌లోనే రూ. 38 కోట్లు వసూలు చేయడం విశేషం.

Details

ప్రపంచ వ్యాప్తంగా రూ.717 కోట్లు రిలీజ్

కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 717 కోట్లు సంపాదించి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా మారింది. కాంతారా చాప్టర్ 1 కన్నడ, హిందీ, తమిళ, తెలుగు వెర్షన్‌లలో కలెక్షన్లలో ఘన విజయం సాధిస్తోంది. రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ముఖ్యంగా రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ నటన ప్రేక్షకుల్ని పూర్తిగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ అక్టోబర్ 31, 2025న రిలీజ్ కానుంది. అలాగే ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కలెక్షన్లలో ఘన విజయం సాధించిన ఈ సినిమా 'ఛావా'ను అధిగమించి మరొక ఘనతను సొంతం చేసుకుంది.