Page Loader
#NTRNeel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ ప్రాజెక్ట్‌లో కన్నడ సూపర్ స్టార్..?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ ప్రాజెక్ట్‌లో కన్నడ సూపర్ స్టార్..?

#NTRNeel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ ప్రాజెక్ట్‌లో కన్నడ సూపర్ స్టార్..?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2024
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రాబోతోంది. NTRNeel పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇటీవల లాంచ్ కాగా, డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో మరో స్టార్ నటుడు కూడా ఉంటారని సమాచారం. కాంతార చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాలు 

వార్ 2 చిత్రీకరణ అనంతరం ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ 

అలాగే ప్రశాంత్ నీల్ కజిన్,కన్నడ రోరింగ్ స్టార్ శ్రీ మురళిని కూడా ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.అయితే ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుండగా, 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర బృందం ప్రకటించింది. తారక్ ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వార్ 2 చిత్రీకరణ అనంతరం ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌లో జాయిన్ అవ్వనున్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ సలార్ 2 ప్రాజెక్ట్‌ను కూడా ఇటీవల ప్రారంభించారు.