Page Loader
Kantara Chapter 1: రిషబ్ శెట్టి బర్త్‌డే గిఫ్ట్.. కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ ఎనౌన్స్!
రిషబ్ శెట్టి బర్త్‌డే గిఫ్ట్.. కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ ఎనౌన్స్!

Kantara Chapter 1: రిషబ్ శెట్టి బర్త్‌డే గిఫ్ట్.. కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ ఎనౌన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 07, 2025
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన 'కాంతార' చిత్రం ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ చిత్రానికి ప్రీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టికి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. 'కాంతార: ఏ లెజెండ్ - చాప్టర్ 1' పేరుతో వస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వివరాలతో పాటు రిషబ్ శెట్టిని పవర్‌ఫుల్ లుక్‌లో చూపించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

Details

వరాహస్వామిలా గెటప్ లో రిషబ్ శెట్టి

ఈ పోస్టర్‌లో ఆయనను వీరగర్జనతో కనిపించే వరాహస్వామిలా చూపించారు. ఇదే ఈ సినిమా అసలైన మొదటి లుక్ అని అభిమానులు భావిస్తున్నారు. ఇంతకుముందు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రిషబ్ ముఖాన్ని పూర్తిగా చూపించలేదు. కానీ తాజాగా వచ్చిన ఈ బర్త్‌డే పోస్టర్‌లో ఆయన వేషధారణ, హావభావాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మొదటి భాగమైన 'కాంతార' చిత్రం విడుదలైనప్పుడు పాన్ ఇండియా రిలీజ్‌పై రిషబ్ శెట్టికి ఎలాంటి ఆలోచనలూ లేవు. కానీ కన్నడలో అద్భుత విజయం సాధించిన తర్వాత ఆ సినిమా ఇతర భాషల్లో విడుదలై విశేష ఆదరణ పొందింది.

Details

ఏడు భాషల్లో రిలీజ్

అదే విజయం ఇప్పుడు ఈ ప్రీక్వెల్‌కు ప్రేరణగా మారింది. హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ఇది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద రిలీజ్ కానుందని సమాచారం. ఈ ప్రీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నది రిషబ్ శెట్టేనే. ఇప్పటికే కేజీఎఫ్, సలార్ వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించిన విజయ్ కిరగందూర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.