LOADING...
Rishab Shetty: సితార బ్యానర్‌లో రిషబ్ శెట్టి సినిమా.. స్పెషల్ పోస్టర్‌తో భారీ అంచనాలు!
సితార బ్యానర్‌లో రిషబ్ శెట్టి సినిమా.. స్పెషల్ పోస్టర్‌తో భారీ అంచనాలు!

Rishab Shetty: సితార బ్యానర్‌లో రిషబ్ శెట్టి సినిమా.. స్పెషల్ పోస్టర్‌తో భారీ అంచనాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2025
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తన తదుపరి ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి చేపట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు 'పెళ్లి చూపులు' ఫేం దర్శకుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అన్ని తిరుగుబాటులకు యుద్ధరంగమే ఆధారం కాదు. కొన్ని విధిచేత ఎంపిక చేయబడతాయి, ఇది ఒక తిరుగుబాటుదారుని కథ అనే ఓ ప్రత్యేక సందేశంతో కూడిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ వాక్యాలు సినిమాకి గంభీరతను చేకూర్చుతూ ఆసక్తిని రేపుతున్నాయి.

Details

త్వరలోనే మరిన్ని వివరాలు

ఈ భారీ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములు కావడం విశేషం. ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నట్లు సమాచారం. ఇప్పటికే 'కాంతార' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న రిషబ్ శెట్టి.. ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నట్లు కనిపిస్తోంది. టాప్ నిర్మాణ సంస్థతో కలిసి, సరికొత్త కథా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.