
Rishab shetty: 'కాంతార చాప్టర్ 1' సన్నివేశాల కోసం ప్రత్యేక నియమాలు పాటించా: రిషబ్‌శెట్టి
ఈ వార్తాకథనం ఏంటి
కాంతారకి ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం కాంతార 2 . 'కాంతార చాప్టర్ 1' పేరుతో ఇది రానుంది. ఈ సినిమాపై ఇటీవల రిషబ్ శెట్టి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కాంతార క్లైమాక్స్ కంటే ఇది ఇంకా శక్తిమంతంగా ఉంటుందన్నారు. 'కాంతార చాప్టర్ 1'లో కొన్ని సన్నివేశాలు ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి. ముఖ్యంగా ఒక ప్రత్యేక సీన్ జీవితాంతం గుర్తుండిపోతుంది. చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి, భాష తేడా లేకుండా..తెలుగు, తమిళ, హిందీ, మలయాళ.. అందరూ ఆ సీన్ గురించి మాట్లాడతారు. దర్శకులు,నిర్మాతలు,సాంకేతిక నిపుణులు అందరూ దానిని ప్రేరణగా తీసుకుంటారు.కాంతార సినిమా తర్వాత నా జీవితం పూర్తిగా మారింది. ప్రేక్షకుల ప్రేమ,ఆదరణ మరవలేనిడి. ఈ విజయానికి క్రెడిట్ నా మొత్తం టీమ్‌కి చెందుతుంది"అని తెలిపారు.
వివరాలు
భగవంతుని పట్ల నాకు గాఢమైన నమ్మకం
"ఈ సినిమాలో దేవుని సంబంధిత సన్నివేశాలను తీర్చిదిద్దేటప్పుడు నేను కొన్ని నియమాలను పాటించాను. ఆ సమయంలో మాంసాహారం తినకుండా, చెప్పులు వేసుకోకుండా షూట్ చేశాను. ఎందుకంటే భగవంతుని పట్ల నాకు గాఢమైన నమ్మకం ఉంది. అందువల్ల ఆ సన్నివేశాల కోసం నేను స్వయంగా పరిమితులు విధించుకున్నాను. ఇతరుల నమ్మకాలను నేను సమీక్షించను; ప్రతి వ్యక్తికి తమదైన విశ్వాసం ఉంటుంది"అని రిషబ్ అన్నారు.
వివరాలు
ఈశ్వర అవతారంలో రిషబ్
ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. కథానాయిక రుక్మిణీ వసంత్. ఈ చిత్రం అక్టోబరు 2న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ట్రైలర్‌లో "నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు?" అనే ప్రశ్నతో కథ ప్రారంభమవుతుంది. ఇందులో కొత్త ప్రపంచం, అసాధారణ ప్రేమకథ, ఈశ్వరుని నేపథ్యం, భారీ యుద్ధ సన్నివేశాలు అన్ని ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రత్యేకంగా, చివర్లో త్రిశూలంతో ఈశ్వర అవతారంలో రిషబ్ కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.