YASH : 'టాక్సిక్' టీజర్ తేదీ ఖరారు..
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం'టాక్సిక్:ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' పై సినీప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.'KGF:చాప్టర్ 2'తర్వాత సుమారు ఐదేళ్ల విరామం తీసుకున్న యష్,ఈ సినిమాతో మళ్లీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి.ఈ చిత్రం 2026మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది,గుడి పడ్వా,ఈద్ పండుగల సందర్భంగా వచ్చే ప్రత్యేకవీకెండ్‌ను దృష్టిలో పెట్టుకుని విడుదల తేదీని నిర్ణయించారు. పండుగ సీజన్‌లో విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద ఘనమైన ప్రారంభ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
వివరాలు
ట్రెండ్ అవుతున్న 'యష్ 19' హ్యాష్‌ట్యాగ్
భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న'టాక్సిక్:ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'చిత్రం టీజర్‌కు సంబంధించిన తాజా అప్డేట్‌ను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 20,2026 శుక్రవారం ఉదయం 9:35గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఉన్న అంచనాలకు తోడు టీజర్ ప్రకటన రావడంతో సోషల్ మీడియాలో 'యష్ 19' హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈచిత్రంలో యష్‌కు జోడీగా కియారా అద్వానీ, నయనతార నటిస్తున్నారు. 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్,మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
9:35 AM | 20.02.2026#ToxicTeaser#Toxic In Cinemas Worldwide from 19-03-2026@TheNameIsYash#Nayanthara@humasqureshi @advani_kiara @rukminitweets #TaraSutaria #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar… pic.twitter.com/HxWOLm08u1
— KVN Productions (@KvnProductions) February 19, 2026