Loading...
Allari Naresh: 'నీ మాటే సరిగమా'తో అలరించిన 'రంభ ఊర్వశి మేనక'

Allari Naresh: 'నీ మాటే సరిగమా'తో అలరించిన 'రంభ ఊర్వశి మేనక'

వ్రాసిన వారు Moogati Shabari
Jul 23, 2026
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొంతకాలంగా విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అల్లరి నరేశ్‌ మరోసారి తనకు గుర్తింపు తీసుకొచ్చిన వినోదాత్మక చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. ఈ చిత్రానికి చంద్రమోహన్‌ చింతా దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేశ్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వివరాలు

మెలోడీ సాంగ్ విడుదల..

చిత్ర ప్రమోషన్లలో భాగంగా మ్యూజికల్‌ సందడి ప్రారంభమైంది.

ఇందులోని 'నా కంటి మీద కునుకే...' అంటూ మొదలయ్యే మెలోడీ సాంగ్‌ను బుధవారం విడుదల చేశారు.

చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించిన ఈ గీతానికి భాస్కరభట్ల రవికుమార్‌ సాహిత్యం అందించగా, ధనుంజయ్‌ సీపాన తన స్వరంతో అలరించారు.

అల్లరి నరేష్, సురభి జంటపై చిత్రీకరించిన ఈ పాట పచ్చని గ్రామీణ వాతావరణం మధ్య ఆహ్లాదకరంగా సాగుతుంది.

వివరాలు

జీతూ మాస్టర్‌ ఆకట్టుకునే డ్యాన్స్..

'నీ మాటే సరిగమా... నీ వెంటే స్వర్గమా... నా చెయ్యే నీ చేయితో జట్టు కట్టమన్నదే... చుక్కల మాలికవా... చక్కని పోలికవా... మనసే నాది... చప్పుడు నీదమ్మా...' అంటూ సాగే ఈ గీతానికి జీతూ మాస్టర్‌ ఆకట్టుకునే నృత్య రూపకల్పన చేశారు.

ఫాంటసీ అంశాలను వినోదంతో మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT