తదుపరి వార్తా కథనం
Madana Mana Mohini: 'కాంతార: చాప్టర్ 1' నుంచి రోమాంటిక్ సాంగ్ 'మదన మన మోహిని' రిలీజ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 19, 2025
11:37 am
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో రూపొందించిన 'కాంతార: చాప్టర్ 1'(Kantara: Chapter 1) సినిమా భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.717 కోట్ల వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించగా, రుక్మిణి వసంత్ కథానాయికగా కనిపించారు. అలాగే జయరాజ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు.సినిమా విజయం తరువాత, మేకర్స్ ఒక్కొక్క పాటను విడదీసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే 'బ్రహ్మ కలశ' పాటను విడుదల చేసిన మేకర్స్, తాజాగా రోమాంటిక్ సాంగ్ 'మదన మన మోహిని'ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ పాటలో విజయ్ ప్రకాష్, అనన్య భట్ గాత్రాలిచ్చారు. సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్, లిరిక్స్ ప్రమోద్ మరవంతే అందించారు.