LOADING...
Sai Pallavi: మళ్లీ కలిసిన 'రౌడీ బేబీ' జోడీ.. 'డీ 55'లో సాయిపల్లవి ఫిక్స్
మళ్లీ కలిసిన 'రౌడీ బేబీ' జోడీ.. 'డీ 55'లో సాయిపల్లవి ఫిక్స్

Sai Pallavi: మళ్లీ కలిసిన 'రౌడీ బేబీ' జోడీ.. 'డీ 55'లో సాయిపల్లవి ఫిక్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2026
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

'రౌడీ బేబీ..' అంటూ 'మారి 2' చిత్రంలో కలిసి నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న హిట్ జోడీ ధనుష్-సాయి పల్లవి మరోసారి తెరపై కనిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ జోడీని మళ్లీ చూడాలనుకుంటున్న అభిమానులకు చిత్రబృందం తాజాగా శుభవార్త అందించింది. ధనుష్‌ హీరోగా నటిస్తున్న 'డీ 55' (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రస్తుతం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక కథానాయికగా శ్రీలీల నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు తాజా అప్‌డేట్‌గా, మరో కీలక నాయిక పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

Details

తన

సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం, సోషల్ మీడియా వేదికగా ఫొటోలు షేర్ చేస్తూ 'ఆమె సౌందర్యానికి, బలానికి ప్రతీక. అందరి అభిమాన తార సాయిపల్లవికి 'డీ 55' ప్రాజెక్ట్‌లోకి స్వాగతం' అనే క్యాప్షన్‌ను జోడించింది. ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ధనుష్‌తో కలిసి సాయిపల్లవి మళ్లీ నటిస్తుండటంతో 'డీ 55'పై అంచనాలు మరింత పెరిగాయి. అభిమానులు మరోసారి ఈ హిట్ కాంబినేషన్ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement