LOADING...
Vijay Devarakonda : జవాన్ల కోసం రౌడీ దుస్తులు.. సైన్యానికి మద్దతు ఇచ్చిన విజయ్ దేవరకొండ
జవాన్ల కోసం రౌడీ దుస్తులు.. సైన్యానికి మద్దతు ఇచ్చిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda : జవాన్ల కోసం రౌడీ దుస్తులు.. సైన్యానికి మద్దతు ఇచ్చిన విజయ్ దేవరకొండ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2025
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ పాకిస్థాన్‌పై కొనసాగిస్తున్న ప్రతీకార యుద్ధానికి దేశవ్యాప్తంగా మద్దతు వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో టాలీవుడ్‌ నటుడు, రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఇండియన్‌ ఆర్మీకి తన మద్దతు ప్రకటించాడు. మొదటి నుంచీ భారత సైన్యం పట్ల గౌరవం చూపుతూ, తరచుగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానం తెలియజేస్తూ వస్తున్న విజయ్‌.. ఇటీవల ప్రారంభమైన 'ఆపరేషన్‌ సిందూర్‌'పై కూడా ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్‌ చేస్తున్న ప్రేరణాత్మక దాడులకు భారత సైన్యం ధీటుగా ప్రతిఘటిస్తుండటంపై ఆయన ప్రశంసలు కురిపించాడు.

Details

విజయ్ నిర్ణయంపై నెటిజన్ల హర్షం

దేశ రక్షణ కోసం సైన్యం చూపుతున్న ధైర్యాన్ని మెచ్చుకుంటూ పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు మద్దతు తెలుపుతుండగా.. తాజాగా విజయ్‌ దేవరకొండ కూడా ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత జవాన్లకు మద్దతుగా తన సొంత దుస్తుల బ్రాండ్ అయిన 'రౌడీ' ద్వారా ప్రత్యేకంగా వస్త్రాలను అందించనున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించడంతో అది నెట్టింట్లో వైరల్‌ అయ్యింది. విజయ్‌ నిర్ణయాన్ని నెటిజన్లు పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. ప్రస్తుతం విజయ్‌ 'కింగ్డమ్‌' సినిమాతో పాటు డైరెక్టర్‌ విజయ్‌ సాంకర్త్యన్‌ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు.