ఆర్ఆర్ఆర్: కొమరం భీమ్ పాత్రను కొరడాతో కొట్టించిన నటుడు కన్నుమూత
ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రను కొరడాతో కొట్టించిన తెల్లదొర పాత్ర వేసిన రే స్టీవెన్ సన్ కన్నుమూశారు. మే 21వ తేదీన ఆదివారం నాడు 58ఏళ్ళ వయసులో రే స్టీవెన్ సన్ తుదిశ్వాస విడిచారు. ఎలా చనిపోయారనే దానిపై వివరాలు బయటకు రాలేదు. 1964లో ఐర్లాండ్ లోని లిస్ బర్న్ నగరంలో మే 25వ తేదీన జన్మించాడు స్టీవెన్ సన్. మొదటిసారిగా తన సినిమా కెరీర్ ను ది థియరీ ఆఫ్ ఫ్లైట్ సినిమా(1998)తో ప్రారంభించాడు. రే స్టీవెన్ సన్ మృతి పట్ల ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, ఆర్ఆర్ఆర్ లో స్టీవెన్ సన్ భార్యగా నటించిన అలిసన్ డూడీ సంతాపం తెలియజేసారు.