LOADING...
Dhurandhar: ఓటీటీలో రూ. 1000 కోట్ల మినీ-బ్లాక్ బస్టర్.. ధురంధర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటీటీలో రూ. 1000 కోట్ల మినీ-బ్లాక్ బస్టర్.. ధురంధర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Dhurandhar: ఓటీటీలో రూ. 1000 కోట్ల మినీ-బ్లాక్ బస్టర్.. ధురంధర్ రిలీజ్ డేట్ ఫిక్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పుడు ఇండియాలో అత్యంత హాట్ టాపిక్‌గా మారిన సినిమా ధురంధర్. ఈ చిత్రం గురించి రోజూ వార్తలు వినిపిస్తూ, ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచుతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో భారీ వసూళ్లను సాధిస్తూ, రికార్డులను తిరగరాస్తూ ఈ స్పై థ్రిల్లర్ మూవీ ఇండియన్ సినిమా సత్తాను మరోసారి చాటుతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ రేట్ విషయంలోనూ కొత్త చరిత్ర సృష్టించింది.

Details

ధురంధర్ ఓటీటీ 

రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ ఇప్పటిదాకా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రికార్డు రేట్ ధురంధర్ సినిమా ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ పొందింది. ఆల్ టైమ్ రికార్డు రేట్‌లో నెట్‌ఫ్లిక్స్ రూ.285 కోట్లను ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇది గత పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసింది, పుష్ప 2 డిజిటల్ హక్కులు రూ.275 కోట్లకు అమ్ముడుపోయాయి.

Details

తెలుగులోనూ

ధురంధర్ హిందీలో మాత్రమే థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తెలుగులో కూడా విడుదల చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకూ అలా జరగలేదు. అయితే ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ధురంధర్ 21 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల వసూళ్లను దాటేసింది. అత్యధిక వేగంతో ఈ ఫీట్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. భారత్‌లోనే నెట్ కలెక్షన్లు రూ.700 కోట్లకు దగ్గరగా ఉన్నాయి. ఇది ఇండియాలో అత్యధిక నెట్ కలెక్షన్ల సాధించిన సినిమా. అంతేకాకుండా 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీ, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు ఖాతాలో వేసుకున్న 'ఏ' రేటెడ్ ఇండియన్ మూవీ కూడా ధురంధర్.

Advertisement