LOADING...
Dhurandhar 2 : రెండు రోజుల్లోనే రూ.331 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' రికార్డుల మోత!
రెండు రోజుల్లోనే రూ.331 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' రికార్డుల మోత!

Dhurandhar 2 : రెండు రోజుల్లోనే రూ.331 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' రికార్డుల మోత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2026
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ధురంధర్ ద రివెంజ్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల తుఫాన్ సృష్టిస్తోంది. తొలి రోజే పాత రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా, రెండో రోజూ అదే జోరును కొనసాగించింది. దేశవ్యాప్తంగా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఆసక్తిగా కూర్చొని ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆస్వాదిస్తున్నారు. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.331 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డుల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే రూ.331 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు కాగా, ఇందులో భారత్‌లోనే రూ.267 కోట్లు వచ్చాయి.

వివరాలు

రెండు రోజుల్లో భారత్‌లో రూ.267 కోట్ల గ్రాస్ వసూలు

విదేశీ మార్కెట్‌లో మరో రూ.64 కోట్లు వసూలయ్యాయి. వీకెండ్‌లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. ఇదే ఊపు కొనసాగితే ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి రూ.500 కోట్ల మార్క్‌ను సులభంగా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దేశీయంగా చూస్తే 'ధురంధర్ 2' కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. రెండు రోజుల్లో భారత్‌లో రూ.267 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, నెట్ కలెక్షన్లు రూ.220.50 కోట్లుగా నమోదయ్యాయి. కేవలం రెండు రోజుల్లోనే 200 కోట్ల నెట్ మార్క్ దాటడం విశేషం. రెండో రోజు ఒక్కరోజే రూ.80 కోట్ల నెట్ వసూళ్లు నమోదు కాగా, తొలి రోజు రూ.102 కోట్లుగా నమోదయ్యాయి.

వివరాలు

రికార్డు స్థాయిలో కలెక్షన్లు

మరోవైపు శనివారం నుంచి తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుండటంతో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం థియేటర్లలో పెద్దగా పోటీ సినిమాలు లేకపోవడం, వీకెండ్ కావడం ఈ చిత్రానికి కలిసొస్తోంది. రణ్‌వీర్ సింగ్ అద్భుత నటన, ఆదిత్య ధర్ మెరుగైన దర్శకత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి స్టార్ నటీనటుల సమిష్టి ప్రదర్శన కూడా సినిమాకు బలంగా మారింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే, 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement