Loading...
Ramayana: రూ.4000 కోట్ల 'రామాయణం'.. రణబీర్, యశ్ రెమ్యునరేషన్ చూసి షాకవ్వాల్సిందే!
రూ.4000 కోట్ల 'రామాయణం'.. రణబీర్, యశ్ రెమ్యునరేషన్ చూసి షాకవ్వాల్సిందే!

Ramayana: రూ.4000 కోట్ల 'రామాయణం'.. రణబీర్, యశ్ రెమ్యునరేషన్ చూసి షాకవ్వాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 07, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో 'రామాయణం' ఒకటి. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ విజువల్ వండర్‌ను సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. తొలి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్ట్‌లో భారతీయ సినీ పరిశ్రమకు చెందిన అగ్రతారలు నటిస్తుండటంతో, వారు అందుకుంటున్న పారితోషికాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న రణబీర్ కపూర్ ఒక్కో భాగానికి రూ.75 కోట్ల చొప్పున, రెండు భాగాలకు కలిపి రూ.150 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం.

వివరాలు

సాయి పల్లవికి రూ.12 కోట్ల రెమ్యునరేషన్ 

రావణాసురుడి పాత్రలో కనిపించనున్న కన్నడ స్టార్ యశ్, ఈ చిత్రానికి సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఆయన ఒక్కో భాగానికి రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.100 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సీతాదేవి పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి ఒక్కో భాగానికి రూ.6 కోట్ల చొప్పున, రెండు భాగాలకు కలిపి రూ.12 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.

హనుమంతుడి పాత్రలో కనిపించే సన్నీ డియోల్ రెండు భాగాలకు కలిపి రూ.40 కోట్లు తీసుకుంటుండగా, లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్న రవి దూబేకు రూ.20 కోట్ల పారితోషికం లభిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు విద్యుత్‌జిహ్వ పాత్రలో నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ మాత్రం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఉచితంగా నటిస్తానని ప్రకటించడం విశేషంగా మారింది.

వివరాలు

దశరథుడి పాత్రలో అరుణ్ గోవిల్

ఈ చిత్రంలో చక్రవర్తి దశరథుడి పాత్రలో అరుణ్ గోవిల్ నటించనుండగా, లారా దత్తా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, శోభన తదితర ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

భారతీయ సినీ పరిశ్రమలోనే అతిపెద్ద స్టార్ కాస్టింగ్‌తో రూపొందుతున్న 'రామాయణం'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అత్యాధునిక సాంకేతికత, విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ADVERTISEMENT