LOADING...
Aishwarya Rai: రూ.4 కోట్ల దావా.. యూట్యూబ్‌ నుంచి ఐశ్వర్య-అభిషేక్‌ వీడియోలు రిమూవ్
రూ.4 కోట్ల దావా.. యూట్యూబ్‌ నుంచి ఐశ్వర్య-అభిషేక్‌ వీడియోలు రిమూవ్

Aishwarya Rai: రూ.4 కోట్ల దావా.. యూట్యూబ్‌ నుంచి ఐశ్వర్య-అభిషేక్‌ వీడియోలు రిమూవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2025
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ స్టార్ దంపతులు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్ తమపై రూపొందించిన ఏఐ వీడియోల విషయంలో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వారు యూట్యూబ్‌పై రూ.4 కోట్ల పరువు నష్టం దావా వేశారు. తాజాగా యూట్యూబ్ ఈ కేసులో వీరి ఫొటోలు, వీడియోలను తొలగించిందని బాలీవుడ్‌లో కథనాలు వెలువడుతున్నాయి. సూచనల ప్రకారం ఏఐ సాయంతో తయారైన వందల వీడియోలు, ఫొటోలు యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించారు. వీరిపై యూట్యూబ్‌లో మొత్తం 259 వీడియోలున్నాయి, వీటి మొత్తం 1.6 కోట్ల వ్యూస్ వచ్చి ఉంటాయి.

Details

గతంలో కోర్టును అశ్రయించిన జంట

ఇప్పుడు ఆ సంస్థ అన్ని వీడియోలను ప్లాట్‌ఫామ్ నుండి తొలగించిందని కథనాలు ప్రచారం అవుతున్నాయి. అంతేకాక, వీరికి సంబంధించిన ఏఐ అకౌంట్ కూడా యూట్యూబ్ ద్వారా తొలగించినట్లు తెలిపింది. గతంలో అభిషేక్‌, ఐశ్వర్య దిల్లీ హైకోర్టును ఆశ్రయించి అనుమతి లేకుండా ఐశ్వర్య ఫొటోలు వాడడం నిషేధం చేయమని కోర్టులో తీర్పు పొందారు. కోర్టు తీర్పు వచ్చినప్పటికీ, యూట్యూబ్‌లో ఏఐ ఇమేజ్‌లు కొనసాగుతున్నందుకు వారు రూ.4 కోట్లకు పరువునష్టం దావా వేసారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో యూట్యూబ్ ఇప్పుడు వీరి ఫొటోలు పూర్తిగా తొలగించిందని సమాచారం అందుతోంది.