LOADING...
NTRNeel : ఫస్ట్ లుక్ ముందే రూ.55 కోట్ల ఓవర్సీస్ డీల్.. ఎన్టీఆర్ సంచలనం
ఫస్ట్ లుక్ ముందే రూ.55 కోట్ల ఓవర్సీస్ డీల్.. ఎన్టీఆర్ సంచలనం

NTRNeel : ఫస్ట్ లుక్ ముందే రూ.55 కోట్ల ఓవర్సీస్ డీల్.. ఎన్టీఆర్ సంచలనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' ప్రస్తుతం షూటింగ్ దశలో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి వెలువడుతున్న తాజా అప్‌డేట్స్ నందమూరి అభిమానుల్లోనే కాకుండా ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ చర్చకు దారి తీస్తున్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే, సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రోమో లేదా టీజర్ విడుదల కాకముందే బాక్సాఫీస్ వద్ద ఇది సృష్టించబోయే ప్రభంజనం గురించి చర్చ మొదలైంది.

Details

ప్రీ-రిలీజ్ బిజినెస్ హాట్ టాపిక్

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్‌తో పాటు ప్రశాంత్ నీల్ బ్రాండ్ వాల్యూ దృష్ట్యా డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలకు హక్కులను సొంతం చేసుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, నార్త్ అమెరికా మరియు యూకే హక్కుల కోసం సుమారు రూ. 55 కోట్ల అడ్వాన్స్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో నార్త్ అమెరికా నుంచి సుమారు 11 మిలియన్ డాలర్లు, యూకే నుంచి 1 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. టాలీవుడ్ చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన, భారీ ఓవర్సీస్ ఒప్పందంగా భావిస్తున్నారు.

Details

తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ అంచనాలు

ఇప్పటివరకు భారతీయ సినీ పరిశ్రమలో నార్త్ అమెరికా మార్కెట్‌లో 10 మిలియన్ డాలర్ల మార్కును దాటిన చిత్రాలు మాత్రమే ప్రత్యేక గుర్తింపు పొందాయి. వాటిలో బాహుబలి, ఆర్ఆర్, కల్కి, పుష్ప ఉన్నాయి. ఇప్పుడు 'డ్రాగన్' కూడా అదే జాబితాలో చేరే దిశగా ముందుకు సాగుతూ, విడుదలకు ముందే ఆ స్థాయి బిజినెస్ నమోదు చేయడం విశేషంగా మారింది. ఓవర్సీస్ మార్కెట్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా కళ్లుచెదిరే స్థాయిలో బిజినెస్ చేసే అవకాశముందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Advertisement