LOADING...
AA22 x A6: అల్లు అర్జున్-అట్లీ సినిమాకు రూ.600 కోట్ల ఓటీటీ డీల్?
అల్లు అర్జున్-అట్లీ సినిమాకు రూ.600 కోట్ల ఓటీటీ డీల్?

AA22 x A6: అల్లు అర్జున్-అట్లీ సినిమాకు రూ.600 కోట్ల ఓటీటీ డీల్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2025
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌, కోలీవుడ్‌ మాస్‌ డైరెక్టర్‌ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త చిత్రం (AA22 x A6) ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక మందన్న, జాన్వీ కపూర్‌ తదితర స్టార్‌ హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. హాలీవుడ్‌ స్థాయి టెక్నీషియన్లను వినియోగిస్తూ, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ హంగులతో ఈ సినిమాను విజువల్‌ వండర్‌గా అట్లీ తెరకెక్కిస్తున్నాడు. 2027 వేసవిలో థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు సృష్టించే దిశగా సాగుతోందని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Details

అత్యధిక ఓటీటీ రేటు సాధించిన సినిమాగా రికార్డు

ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్‌ రైట్స్‌ కోసం నెట్‌ఫ్లిక్స్‌ ఏకంగా రూ.600 కోట్ల ఆఫర్‌ చేసినట్టు సమాచారం. ఇది అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప 2' చిత్రానికి లభించిన రూ.275కోట్ల ఓటీటీ డీల్‌ను రెట్టింపుకంటే ఎక్కువగా అధిగమించడమే కాకుండా కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవనుంది. దాదాపు రూ.1,000కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం భారత సినీ చరిత్రలో అత్యధిక ఓటీటీ రేటు సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పనుంది. ఈ భారీ ఒప్పందానికి సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. అల్లు అర్జున్‌ అభిమానులు "ఇది మా హీరో రేంజ్‌" అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లతో హంగామా చేస్తున్నారు.

Advertisement