Page Loader
Ravi Teja: రవితేజ RT76 నుంచి ఫ్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్.. షూటింగ్ స్టార్ట్
రవితేజ RT76 నుంచి ఫ్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్.. షూటింగ్ స్టార్ట్

Ravi Teja: రవితేజ RT76 నుంచి ఫ్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్.. షూటింగ్ స్టార్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజా రవితేజ త్వరలో 'మాస్ జాతర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా,ఈ ఏడాది ఆగస్టు 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇకపోతే, 'మాస్ జాతర'తో పాటు రవితేజ తాజాగా తన 76వ సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్‌గా "RT-76" అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు కిషోర్. ఈ చిత్రానికి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది.

వివరాలు 

RT-76కు సంబంధించిన కీలక అప్డేట్‌

ఇటీవలి రోజుల్లో RT-76 మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు,ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటనతో రవితేజ అభిమానులు షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో,తాజాగా మేకర్స్ RT-76కు సంబంధించిన కీలక అప్డేట్‌ను షేర్ చేశారు.

వివరాలు 

కంఫర్ట్ జోన్‌లో రవితేజ

"టాకీ పార్ట్ చిత్రీకరణతో RT-76 సినిమా సెట్స్ పైకి వచ్చేసింది.టైటిల్,ఫస్ట్ లుక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నాం. 2026 సంక్రాంతి సందర్భంగా సినిమా థియేటర్లలో విడుదల కానుంది" అని అధికారికంగా తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభమైన టాకీ పార్ట్‌లో భాగంగా,సినిమా టీమ్ పలు ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణను చేపట్టనుంది. ఈ సినిమాలో రవితేజ తనకు అనుగుణమైన కంఫర్ట్ జోన్‌లో నటిస్తూ, ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించబోతున్నాడు అన్న టాక్ వినిపిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్