LOADING...
Kantara 2: కాంతార 2 నుంచి 'కనకవతి' పోస్టర్ విడుదల.. వావ్ అనిపించిన స్టార్ హీరోయిన్
కాంతార 2 నుంచి 'కనకవతి' పోస్టర్ విడుదల.. వావ్ అనిపించిన స్టార్ హీరోయిన్

Kantara 2: కాంతార 2 నుంచి 'కనకవతి' పోస్టర్ విడుదల.. వావ్ అనిపించిన స్టార్ హీరోయిన్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

'కాంతార' చిత్రంలో కన్నడ నటి సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించి,ఈ సినిమాతో పాన్‌-ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు అనేక భాషల సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న'కాంతార:చాప్టర్ 1'లో హీరోయిన్ ఎవరో ఇప్పటివరకు చిత్ర బృందం వెల్లడించలేదు. అయితే,తాజాగా ఈ అంశంపై అధికారిక సమాచారం వెలువడింది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా 'కాంతార 2' నుంచి కనకవతి పాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం వరుస సినిమాలతో రద్దీగా ఉన్న రుక్మిణి వసంత్ ఈ పాత్రను పోషిస్తోంది. 'సప్తసాగరాలు దాటి' చిత్రంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆమె, ఇప్పుడు 'కాంతార:చాప్టర్ 1'లో భాగం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.

వివరాలు 

రుక్మిణి పాత్రపై  సస్పెన్స్‌

సినిమాలో రుక్మిణి యువరాణిలా కనిపిస్తున్నప్పటికీ, ఆమె పాత్ర ఏమిటన్నది మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు. పోస్టర్‌లో వెనుకభాగం రాజసభలా కనిపించడం, కథ కదంబ కాలం నాటిది కావడం వల్ల రుక్మిణి రాణి పాత్రలో నటిస్తుందా, లేక యువరాణిగా కనిపిస్తుందా అన్న ఆసక్తి పెరిగింది. 'కాంతార:చాప్టర్ 1' హీరోయిన్ ఎవరు అనే అంశంపై ఇప్పటివరకు చాలా చర్చలు జరిగాయి. చివరికి ఈ ప్రశ్నకు సమాధానం లభించింది.రుక్మిణి వసంత్‌కి ఇప్పటికే పాన్‌-ఇండియా స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. ఆమె ఇప్పటికే చాలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

వివరాలు 

అక్టోబర్ 2న 7 భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల

ఈ చిత్రానికి అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. హోంబాలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కనకవతి ని పరిచయం చేసిన నిర్మాణ సంస్థ