తదుపరి వార్తా కథనం
రూల్స్ రంజన్: సమ్మోహనుడా పాటలో నేహా శెట్టి అందాల ఆరబోత
వ్రాసిన వారు
Sriram Pranateja
Jul 20, 2023
10:47 am
ఈ వార్తాకథనం ఏంటి
వరుస పెట్టి సినిమాలు తీస్తున్న కిరణ్ అబ్బవరం నుండి మీటర్ తర్వాత వస్తున్న చిత్రం రూల్స్ రంజన్. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజైంది.
సమ్మోహనుడా అంటూ సాగే రొమాంటిక్ పాటలో నేహా శెట్టి అందంగా కనిపిస్తోంది. లిరికల్ వీడియోలో కనిపించిన నేహాశెట్టి అందాలు కుర్రకారును కిర్రెక్కిస్తున్నాయి.
శ్రేయా ఘోషల్ గొంతులోంచి వచ్చిన ఈ పాట, మత్తుగా రొమాంటిక్ గా, పాడుకోవడానికి వీలుగా ఉంది. ఈ పాటకు సాహిత్యాన్ని దర్శకుడు రాతినం క్రిష్ణ, రాంబాబు గోసాల రాసారు.
ఏఎమ్ రత్నం సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రాతినం క్రిష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రూల్స్ రంజన్ నుండి రొమాంటిక్ సాంగ్ రిలీజ్
Sammohanuda 🔥https://t.co/NqIJZMzTN8#RulesRanjann #Sammohanuda pic.twitter.com/5wUH2i4Cr2
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 20, 2023