Devara: 'దేవర' విడుదల వాయిదా! కారణం ఇదేనా?
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే.
పార్ట్-1ను ఏప్రిల్ 5న విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఆ విడుదల వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.
షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చాలా పెండింగ్‌లో ఉండటం.. ఇదే సమయంలో సైఫ్ అలీఖాన్ సర్జరీ చేయించుకోవడం కూడా సినిమా వాయిదాపడటానికి కారణాలుగా ప్రచారం జరుగుతోంది.
ఏప్రిల్ 5న సూర్య 'కంగువ'సినిమా, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన 'బడే మియాన్ చోటే మియాన్', అజయ్ దేవగణ్ 'మైదాన్' వంటి మూవీస్ వస్తున్నాయి. ఈ సినిమా రావడం వల్ల కూడా 'దేవర' విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దేవర విడుదల వాయిదా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
So #Devara is Postponed. The new date will be announced soon !
— CineHub (@Its_CineHub) January 23, 2024
A good move ? pic.twitter.com/00FyY2f6wZ