Page Loader
Sai Dharam Tej: రచ్చరచ్చ చేసిన 'గాంజా శంకర్'.. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా గ్లింప్స్ అదుర్స్ 
రచ్చరచ్చ చేసిన 'గాంజా శంకర్'.. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా గ్లింప్స్ అదుర్స్

Sai Dharam Tej: రచ్చరచ్చ చేసిన 'గాంజా శంకర్'.. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా గ్లింప్స్ అదుర్స్ 

వ్రాసిన వారు Stalin
Oct 15, 2023
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు సంపత్ నంది- సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్ ఖరారైంది. ఈ సినిమాకు 'గాంజా శంకర్' పేరును ఫైనల్ చేశారు. ఆదివారం సాయి ధరమ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా మూవీ మేకర్స్ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ధరమ్ తేజ్ మాస్‌గా కనిపించబోనున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది. స్మగ్లర్‌గా గాంజా శంకర్ అనే పవర్ ఫుల్ పాత్రలో తేజ్ కనిపించబోతున్నాడు. యాక్షన్‌తో కూడిన ఈ ఎంటర్‌టైనర్ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాత నాగ వంశీ, సాయి సౌజన్య సహకారంతో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫుల్ జోష్‌లో తేజ్ ఫ్యాన్స్