విరూపాక్ష ట్రైలర్: పండగ పర్వదినాన రిలీజ్ కి సిద్ధం?
దర్శకుడి సుకుమార్, తన కెరీర్లోనే మొట్ట మొదటి సారి రాసిన థ్రిల్లర్ కథ విరూపాక్ష. సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ బ్యానర్లు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. ఏప్రిల్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్ అవుతోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ సినిమాను, కార్తీక్ దండు డైరెక్ట్ చేసారు. విరూపాక్ష టీజర్ ఆల్రెడీ విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందిపుచ్చుకుంది. విభిన్నమైన కథాంశంతో, థ్రిల్లింగ్ అంశాలతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. దాంతో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు.
ఉగాది రోజున విరూపాక్ష ట్రైలర్ రిలీజ్
విరూపాక్ష ట్రైలర్ ను ఉగాది రోజున రిలీజ్ చేయాలని చిత్రబృందం అనుకుంటుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారిక సమాచారం వస్తుందని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే అభిమానులకు అంతకు మించి ఆనందం మరోటి ఉండదు. విరూపాక్ష సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడీగా సంయుక్తా మీనన్ కనిపిస్తోంది. అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్న విరూపాక్ష మూవీలో, సాయి చంద్, బ్రహ్మాజీ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఒక ఊరిలో జరిగే వింత సంఘటనల వెనుక రహస్యం కనుక్కోవడానికి హీరో ఏం చేసాడన్న కథాంశంతో విరూపాక్ష తెరకెక్కిందని టీజర్ ద్వారా అర్థమైంది. ట్రైలర్ రిలీజైతే మరిన్ని అంశాలు తెలిసే అవకాశం ఉంది.