Sambarala Yeti Gattu : సాయి దుర్గ తేజ్ బర్త్ డే స్పెషల్.. 'సంబరాల ఏటి గట్టు' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!
ఈ వార్తాకథనం ఏంటి
సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'సంబరాల ఏటి గట్టు' సినిమా సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ చిత్రం ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రోహిత్ దర్శకత్వంలో భారీగా పీరియాడిక్ యాక్షన్‌గా రూపొందుతోంది. తాజాగా వచ్చిన గ్లింప్స్, సాయి తేజ్ ఫొటోస్ సినిమాపై అభిమానుల్లో అంచనాలను పెంచాయి. ఈ సినిమా కోసం సాయి తేజ్ ప్రత్యేకంగా మంచి బాడీ బిల్డ్ చేసుకున్నాడు. ఈరోజు సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా, సంబరాల ఏటి గట్టు సినిమా నుండి 'అసుర ఆగమనం' ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది.
Details
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్
టీజర్ చూస్తే కేజీఎఫ్ వంటి గ్రాండ్ సెటప్ గుర్తొస్తోంది. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంటుందనే ఊహాగాహాలను తెలుస్తోంది. ఇప్పటివరకు సినిమా షూటింగ్ దశలో ఉంది. నిర్మాతలు దీన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.