Sai Durgha Tej Engagement: ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మెగా కుటుంబంలో మరో పెళ్లి సందడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, యువ నటుడు సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. కిరణ్ అనే అమ్మాయితో సాయి దుర్గా తేజ్ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో గురువారం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాయి దుర్గా తేజ్, కిరణ్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వీరి వివాహం డిసెంబరు 10న హైదరాబాద్‌లో జరగనుంది. దీంతో మెగా అభిమానుల్లో పెళ్లి సందడి మొదలైంది.
వివరాలు
పలువురు ప్రముఖుల హాజరు
గురువారం నిర్వహించిన నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
సాయి దుర్గా తేజ్ తల్లిదండ్రులు డాక్టర్ శివప్రసాద్, విజయ్ దుర్గా, సోదరుడు వైష్ణవ్ తేజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
అలాగే ఆయన అత్తయ్య, మావయ్య చిరంజీవి, సురేఖలతో పాటు రామ్‌చరణ్ కూడా హాజరయ్యారు.
మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్, ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి, అల్లు బాబీ, వరుణ్ తేజ్, ఆయన భార్య లావణ్య త్రిపాఠి, వాయువ్ తేజ్, నాగబాబు, పద్మజ, నిహారిక కొణిదెల, అల్లు అరవింద్, అల్లు నిర్మల, అల్లు శిరీష్, నయనిక రెడ్డి, అఖీరా నందన్, ఆద్య తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు.
వివరాలు
ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
సాయి దుర్గా తేజ్ స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు.
మంచు మనోజ్, మౌనికారెడ్డి, నవీన్ విజయ్ కృష్ణ, హర్ష చెముడు, వెంకీ కుడుముల, హర్షిత్‌రెడ్డి తదితరులు ఈ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇలా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ ప్రముఖుల సమక్షంలో సాయి దుర్గా తేజ్-కిరణ్‌ల నిశ్చితార్థ వేడుక సందడిగా జరిగింది.
డిసెంబరు 10న హైదరాబాద్‌లో జరగనున్న వీరి వివాహం కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.