Sai Durgha Tej: మోగ్లీ దర్శకుడికి మద్దతుగా నిలిచిన సాయి దుర్గాతేజ్
ఈ వార్తాకథనం ఏంటి
బాలకృష్ణ నటించిన 'అఖండ 2' (Akhanda 2) కొత్త విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేకపోవడం చిన్న చిత్రాల రిలీజ్ ప్లానింగ్‌ను గందరగోళంలో పడేసింది. ముఖ్యంగా డిసెంబరు 12న బాక్సాఫీసుకు రావాలని సిద్ధమైన వేళ పలు సినిమాలు ఇప్పుడు అనిశ్చితిలో ఉన్నాయి. 'అఖండ 2' అదే తేదీకి విడుదలైతే, చిన్న సినిమాలు వాయిదా పడే అవకాశముందని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) తన కొత్త చిత్రం 'మోగ్లీ'పై చేసిన పోస్ట్ మరింత దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన తన తొలి చిత్రం 'కలర్ ఫోటో' సమయంలో కూడా ఇలాంటి సమస్యలనెదుర్కొన్నట్టు భావోద్వేగంగా వెల్లడించారు.
Details
మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది
సందీప్ రాజ్ ట్వీట్‌కు నటుడు సాయి దుర్గాతేజ్(Sai Durgha Tej), నిర్మాత ఎస్కేఎన్(Producer SKN) స్పందిస్తూ ఆయనకు ధైర్యం చెప్పారు. సాయి దుర్గాతేజ్ ఇలా వ్యాఖ్యానించారు: సందీప్.. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అంచనా వేసినదానికంటే గొప్పగా దక్కుతుంది. ధైర్యంగా ఉండండి. చివరికి సినిమా గెలుస్తుంది. అదే విధంగా ఎస్కేఎన్ డియర్ సందీప్.. జాతీయ అవార్డు గెలుచుకున్న 'కలర్ ఫోటో'లో మీరు ఒక ముఖ్య భాగం. ఇవన్నీ తాత్కాలిక అడ్డంకులు. దిగులు పడొద్దు. మీ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారని చెప్పారు. అయితే సందీప్ రాజ్ ఏమన్నారంటే 'కలర్ ఫోటో', 'మోగ్లీ'కు తన కంటే మంచి దర్శకులు ఉండాల్సిందేమోనని తాను అనిపించుకుంటున్నట్టు చెప్పారు. ఈ రెండు సినిమాలకు రెండు కామన్ పాయింట్లు ఉన్నాయని తెలిపారు.
Details
దురదృష్టం వెంటాడుతోంది
అన్నీ సవ్యంగా సాగుతున్నట్టు అనిపించినప్పటికీ విడుదల సమయంలో దురదృష్టం వెంటాడుతోందన్నారు. 'డైరెక్టెడ్ బై సందీప్ రాజ్' అని వెండితెరపై నా పేరు చూసుకోవడం నా కల. కానీ ఆ కల రోజు రోజుకూ దూరమవుతోంది. సిల్వర్ స్క్రీన్ నన్ను ద్వేషిస్తున్నట్టుందని బాధపడ్డారు. 'మోగ్లీ' కోసం హీరో రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, డీవోపీ మారుతి, మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవతో పాటు అనేక మంది అంకితభావంతో పనిచేశారని చెప్పారు. వారి కోసం అయినా ఈ సినిమా విషయంలో మంచి జరగాలని కోరుకున్నట్టు ఆయన తెలిపారు. 'మోగ్లీ' డిసెంబరు 12న విడుదల కావాల్సి ఉంది. కానీ తాజా పరిస్థితుల దృష్ట్యా ఇది వాయిదా పడే అవకాశముందనే ప్రచారం జోరుగా సాగుతోంది.