Page Loader
Sai Durgha Tej: రాజకీయాల్లోకి అడుగు..: సాయిదుర్గా తేజ్ ఏమన్నారంటే
రాజకీయాల్లోకి అడుగు..: సాయిదుర్గా తేజ్ ఏమన్నారంటే

Sai Durgha Tej: రాజకీయాల్లోకి అడుగు..: సాయిదుర్గా తేజ్ ఏమన్నారంటే

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 25, 2024
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ నటుడు సాయిదుర్గా తేజ్‌ (Sai Durgha Tej) రాజకీయాల్లోకి అడుగుపెట్టాలన్న అంశంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రస్తుత కాలంలో రాజకీయాల్లోకి చేరాలంటే చాలా విషయాలపై అవగాహన ఉండాలి అని ఓ వెబ్‌సైట్‌ నిర్వహించిన కార్యక్రమంలో తెలిపారు. "నా దృష్టి మొత్తం సినిమాలపై ఉంది. విభిన్నమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాలనే ఆశ ఉంది. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ప్రస్తుతం లేదు. పాలిటిక్స్‌లోకి వస్తానంటే చాలా విషయాలను నేర్చుకోవాలి, ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి" అని తేజ్‌ వెల్లడించారు.

వివరాలు 

ఆ ప్రమాదం తర్వాత.. ఆచితూచి అడుగులు

తనకు ఇది పునర్జన్మ అని చెప్పిన ఆయన, యాక్సిడెంట్‌ అయిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ ప్రమాదం తర్వాత సుమారు రెండు వారాల పాటు కోమాలో ఉన్నానని తెలిపారు. ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని, అదే తన ప్రాణాలను కాపాడిందని వివరించారు. సినిమా విషయానికి వస్తే, యాక్సిడెంట్‌ తరువాత కెరీర్‌ విషయంలో సాయిదుర్గా తేజ్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆయన నటించిన 'విరూపాక్ష' ,'బ్రో' గత సంవత్సరం విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆయన రోహిత్‌ కేపీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.