LOADING...
Ek Din First Look: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ: జునైద్ ఖాన్‌తో 'ఏక్ దిన్' ఫస్ట్ లుక్ వైరల్!
జునైద్ ఖాన్‌తో 'ఏక్ దిన్' ఫస్ట్ లుక్ వైరల్!

Ek Din First Look: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ: జునైద్ ఖాన్‌తో 'ఏక్ దిన్' ఫస్ట్ లుక్ వైరల్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, సహజ అందం సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతున్న భారీ రొమాంటిక్ డ్రామా 'ఏక్ దిన్' కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ సంక్రాంతి కానుకగా విడుదల చేసింది. జపాన్ లోని మంచు కురిసే అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్, సాయి పల్లవి, జునైద్ ఖాన్‌ల మధ్య కెమిస్ట్రీ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. సునీల్ పాండే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమీర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణా పురోహిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

వివరాలు 

సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు..

విశేషం ఏమిటంటే, దాదాపు 17 ఏళ్ల తర్వాత అమీర్ ఖాన్, మన్సూర్ ఖాన్ మళ్లీ కలిసి పని చేస్తున్నారు. కథలో ఇద్దరు అపరిచితుల మధ్య ఒక్కరోజులో జరిగే భావోద్వేగాల మార్పుల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. రామ్ సంపత్ సంగీతాన్ని అందిస్తుండగా, ఇర్షాద్ కామిల్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. మనోజ్ లోబో సినిమాటోగ్రఫీ, బల్లు సలూజా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాయి పల్లవి ఇప్పటికే రణబీర్ కపూర్ సరసన 'రామాయణం' లో సీతగా నటిస్తున్నప్పటికీ, 'ఏక్ దిన్' విడుదల తేదీ అంతకంటే ముందే ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం, సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ 

Advertisement