LOADING...
Ek Din Trailer: అమీర్ ఖాన్‌ తనయుడు జునైద్ ఖాన్ తో సాయి పల్లవి జోడీ.. 'ఏక్ దిన్' ట్రైలర్ రిలీజ్
అమీర్ ఖాన్‌ తనయుడు జునైద్ ఖాన్ తో సాయి పల్లవి జోడీ.. 'ఏక్ దిన్' ట్రైలర్ రిలీజ్

Ek Din Trailer: అమీర్ ఖాన్‌ తనయుడు జునైద్ ఖాన్ తో సాయి పల్లవి జోడీ.. 'ఏక్ దిన్' ట్రైలర్ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2026
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

జునైద్ ఖాన్, సాయిప‌ల్ల‌వి జంటగా నటించిన తాజా చిత్రం ఏక్ దిన్‌. ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే సాయి పల్లవి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం బుధవారం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఏక్ దిన్‌ ట్రైలర్ ప్రారంభంలో సరదాగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తరువాత భావోద్వేగభరితంగా మారుతుంది.

Details

ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న  ట్రైలర్

ఈ సినిమాలో జునైద్ ఖాన్ రోహన్ పాత్రలో సాయి పల్లవి మీరా పాత్రలో సహోద్యోగులుగా కనిపించనున్నారు. మీరాను ఇష్టపడే రోహన్ తన ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం భయపడుతూ ఉంటాడు. అయితే కనీసం ఒక రోజు అయినా ఆమెతో కలిసి ప్రయాణం చేయాలని అతడు కలలు కంటాడు. ఆ కల నిజమైందా? అనే ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమా కథ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

Advertisement