LOADING...
Sai Pallavi: సాయి పల్లవి బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్.. అసలు నిజం ఇదే!
సాయి పల్లవి బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్.. అసలు నిజం ఇదే!

Sai Pallavi: సాయి పల్లవి బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్.. అసలు నిజం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2025
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

సహజమైన నటనతో, అందంతో అపారమైన అభిమానులను సంపాదించుకున్న నటి సాయి పల్లవి తాజాగా సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యారు. ఆమె బికినీ ధరించారంటూ కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. సాధారణంగా గ్లామర్ పాత్రలకు, ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండే సాయి పల్లవి ఇలాంటి లుక్‌లో కనిపించడం చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. "బికినీలో సాయి పల్లవేంటి?" అని షాక్ అవుతున్నారు. కానీ, ఈ ఫొటోలు అసలు నిజం కావని స్పష్టమైంది.

Details

సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

కొన్ని ఫొటోలను కృత్రిమ మేధ (AI) సాయంతో మార్ఫ్ చేసి ఇలా సృష్టించారని సమాచారం. సోషల్ మీడియాలో సాయి పల్లవి సోదరి షేర్ చేసిన చిత్రాలను కొందరు ఏఐ టూల్స్ ఉపయోగించి మార్చి, సాయి పల్లవి బికినీ ధరించినట్టుగా ఫేక్ ఫొటోలు తయారు చేశారు. ఆ మార్ఫ్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.