LOADING...
Sai Pallavi : సాయి పల్లవి కొత్త సినిమా.. 'ఎల్లమ్మ'లో నితిన్ సరసన మెరవనుందా?
సాయి పల్లవి కొత్త సినిమా.. 'ఎల్లమ్మ'లో నితిన్ సరసన మెరవనుందా?

Sai Pallavi : సాయి పల్లవి కొత్త సినిమా.. 'ఎల్లమ్మ'లో నితిన్ సరసన మెరవనుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2024
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాయి పల్లవి ఏ సినిమాకు సైన్ చేసిందంటే, ఆ సినిమా హిట్ అవుతుందనే భావన ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పటివరకు సాయి పల్లవి చేసిన సినిమాల సక్సెస్ రేట్ చూస్తే, ఆమెకు ఉన్న క్రేజ్‌ స్పష్టమవుతుంది. లేడీ పవర్ స్టార్‌గా పేరొందిన సాయి పల్లవి ఏ సినిమాకు ఒప్పుకుంటే, ఆ ప్రాజెక్ట్‌కు ఆటోమేటిక్‌గా హైప్ వస్తుంది. ఇటీవల 'అమరన్' సినిమాలో అద్భుతమైన నటనతో ఆమె సాలిడ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ 'రామాయణ్' లో భాగమవుతూ, తెలుగులో నాగ చైతన్య సరసన 'తండేల్' సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలున్నాయి. తాజాగా సాయి పల్లవి మరో తెలుగు ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Details

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఎల్లమ్మ

'బలగం' సినిమాతో సూపర్ హిట్ సాధించిన డైరెక్టర్ వేణు ఎల్దండి, 'ఎల్లమ్మ' అనే చిత్రాన్ని డిజైన్ చేస్తున్నారు. నితిన్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. వేణు చెప్పిన కథ ఎంతో నచ్చడంతో సాయి పల్లవి వెంటనే ఆ సినిమాకు ఓకే చెప్పేసిందట. అంతేకాదు డేట్స్ కూడా కేటాయించిందని టాక్. ఈ చిత్రం తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. 'ఎల్లమ్మ' పాత్ర ఆమెకు ఎంతో సరిపోతుందని అనిపిస్తోంది. ఈ సినిమా ఆమెకు మరొక స్టాండౌట్ క్యారెక్టర్‌ను అందించనుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.