Sai Pallavi: పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి.. ధనుష్ 55లో యాక్షన్ అవతారం!
ఈ వార్తాకథనం ఏంటి
'ఏక్ దిన్' చిత్రంలో ప్రేమికురాలి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, త్వరలో 'రామాయణం'లో సీత పాత్రలో మెప్పించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఆమె మరో విభిన్న పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో సాయిపల్లవి పోలీసు అధికారిణి పాత్ర పోషించనున్నట్లు సమాచారం.
వివరాలు
అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
ప్రస్తుతం 'ధనుష్ 55' (వర్కింగ్ టైటిల్) పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవితో పాటు శ్రీలీల కూడా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో సాయిపల్లవి పాత్రకు యాక్షన్‌కు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. నేరస్తులను వెంటాడే ధైర్యవంతమైన పోలీసు అధికారిణిగా ఆమె కనిపించనున్నారని, ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నమైన లుక్, బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నారని తమిళ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.