తదుపరి వార్తా కథనం

జూనియర్ ఎన్టీఆర్ దేవర నుండి బిగ్ అప్డేట్: సైఫ్ ఆలీ ఖాన్ లుక్ రిలీజ్
వ్రాసిన వారు
Sriram Pranateja
Aug 16, 2023
02:44 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ ఆలీ ఖాన్ లుక్ రిలీజైంది. భైర పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నాడని పరిచయం చేసారు.
సినిమా ప్రారంభమైనపుడు దర్శకుడు కొరటాల శివ, ఈ సినిమాలో కరడుగట్టిన మనుషులు ఉంటారని వెల్లడి చేసాడు. ఆ మాటల ప్రకారంగానే సైఫ్ ఆలీ ఖాన్ లుక్ ఉంది.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా, 2024 ఏప్రిల్ 5వ తేదీన తెలుగు సహా తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో విడుదలవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సైఫ్ ఆలీ ఖాన్ లుక్ విడుదలపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
BHAIRA
— Jr NTR (@tarak9999) August 16, 2023
Happy Birthday Saif sir !#Devara pic.twitter.com/DovAh2Y781
మీరు పూర్తి చేశారు