Page Loader
సైమా అవార్డ్స్ 2023 సెలబ్రేషన్స్ నిర్వహణ తేదీలు వచ్చేశాయ్, వేదిక ఎక్కడంటే! 
బృందాప్రసాద్, మృణాల్ ఠాకూర్, రానా

సైమా అవార్డ్స్ 2023 సెలబ్రేషన్స్ నిర్వహణ తేదీలు వచ్చేశాయ్, వేదిక ఎక్కడంటే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 08, 2023
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌత్ ఇండియన్ ఇంటర్నేషన్ మూవీ అవార్డ్స్ (సైమా) 2023 వేడుకలకు మూహుర్తం ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో 15, 16 తేదీల్లో ఈ వేడుకల్ని అట్టహాసంగా నిర్వహిస్తామని సైమా ఛైర్ పర్సన్ బృందాప్రసాద్ తెలిపారు. 11 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ పురస్కారాల వేడుకకు ఈసారి దుబాయ్ వేదిక కానుందని ఆమె చెప్పారు. స్పాన్సర్‌గా ఆటోమొబైల్ సంస్థ నెక్సా ఈ వేడుకల్లో భాగం కానుంది. దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రతిభను గుర్తించేందుకు సైమా, నెక్సా కలవడం సంతోషంగా ఉందని, భవిష్యతులో ఈ బంధం మరింత బలపడి, దక్షిణాది సినీ పరిశ్రమ అభివృద్ధికి పాటుపడతాయని బృందాప్రసాద్ పేర్కొన్నారు.

Details

సైమాలో భాగం కావడం సంతోషంగా ఉంది : రానా 

హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఏకతాటిపైకి సైమా తీసుకొచ్చిందని, ఈ వేడుకల్లో తాను భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కథానాయిక మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ దక్షిణాది అభిమానులు తనను ఎంతో ఆదరించారని, సీతారామం విడుదలైన వెంటనే సైమాలో భాగం కావడం ఆనందగా ఉందని, దుబాయ్‌లోని డిడబ్ల్యూటీసీలో జరగనున్న ఈ అంతర్జాతీయ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తానని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లలో దక్షిణ భారతీయ చిత్రాలను ప్రోత్సహించడానికి సైమా వేదికను 2012లో ఏర్పాటు చేశారు.