Page Loader
భోళాశంకర్ తాజా అప్డేట్: మే డే కానుకగా మాస్ అవతార్ లో చిరంజీవి 
భోళాశంకర్ చిత్రంలో చిరంజీవి

భోళాశంకర్ తాజా అప్డేట్: మే డే కానుకగా మాస్ అవతార్ లో చిరంజీవి 

వ్రాసిన వారు Sriram Pranateja
May 01, 2023
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాల్తేరు వీరయ్య తర్వాత భోళాశంకర్ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా చిరంజీవి లుక్ బయటకు వచ్చింది. మే డే కానుకగా రిలీజ్ చేసిన ఈ లుక్ లో, ట్యాక్సీ డ్రైవర్ గా కనిపించారు మెగాస్టార్ చిరంజీవి. బ్లూ కలర్ షర్ట్ వేసుకుని ట్యాక్సీలో డ్రైవర్ సీట్లో కూర్చుని చేతిలో టీ గ్లాసును పట్టుకుని మాస్ అవతారంలో కనిపించారు. ఈ ఫోటోలు రిలీజ్ చేస్తూ, కార్మికులు, కర్షకులు, శ్రమ జీవులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది చిత్ర నిర్మాణ సంస్థ. తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ సినిమా, ఆగస్టు 11న విడుదల అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భోళాశంకర్ నుండి చిరంజీవి ఫోటోలు విడుదల