LOADING...
Salaar2 : సలార్ 2 కోసం రెడీ అవుతున్న హోంబలే ఫిలిమ్స్.. నిర్మాత కీలక ప్రకటన
సలార్ 2 కోసం రెడీ అవుతున్న హోంబలే ఫిలిమ్స్.. నిర్మాత కీలక ప్రకటన

Salaar2 : సలార్ 2 కోసం రెడీ అవుతున్న హోంబలే ఫిలిమ్స్.. నిర్మాత కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

వరుసగా భారీ సినిమాలతో భారతీయ బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ తాజాగా తమ అత్యంత ఆసక్తికరమైన సీక్వెల్ 'సలార్ 2' గురించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ, ఈ చిత్ర షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన నేపథ్యంలో, రెండో భాగాన్ని ఇంకా భారీ స్థాయిలో, మరింత అద్భుతంగా రూపొందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.

వివరాలు 

'సలార్ 2'తో మరో మైలురాయి

దర్శకుడు ప్రశాంత్ నీల్ తన మేకింగ్ స్టైల్,క్వాలిటీ విషయంలో ఎప్పుడూ రాజీ పడరని కూడా విజయ్ కిరగందూర్ స్పష్టం చేశారు. ఈ సినిమాపై ఆలస్యం జరుగుతోందన్న వదంతులను ఆయన ఖండించారు. ప్రశాంత్ నీల్ నిర్ణయించే ఉన్నత ప్రమాణాల కారణంగానే కొంత సమయం పట్టిందని,ప్రభాస్‌తో హోంబలే ఫిలిమ్స్ కుదుర్చుకున్న మల్టీ-ఫిలిం ఒప్పందంలో ఈ ప్రాజెక్ట్‌కు అత్యంత ప్రాధాన్యం ఉందని వెల్లడించారు. 'కేజీఎఫ్', 'కాంతార' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన హోంబలే ఫిలిమ్స్, ఇప్పుడు 'సలార్ 2'తో మరో మైలురాయిని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న 'సలార్' సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండటం గమనార్హం.

వివరాలు 

ఎన్టీఆర్‌తో సినిమా తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్

అందుకే రెండో భాగాన్ని మరింత పెద్ద స్థాయిలో రూపొందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామని నిర్మాత చెప్పారు. మొత్తానికి 'సలార్ 2' షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందనే అధికారిక సమాచారం రావడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యిన తర్వాత 'సలార్ 2' పనులు ప్రారంభమయ్యే అవకాశముంది.

Advertisement