
సలార్ వర్సెస్ డంకీ: రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు రావడంపై పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సలార్ చిత్రం డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుంది.
అదే రోజున బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమా కూడా థియేటర్లలోకి వస్తుంది. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
నిన్న మొన్నటి వరకు షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమా వాయిదా పడుతుందని అన్నారు. కానీ ఆ తర్వాత ఆ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
తాజాగా సలార్, డంకీ సినిమాలు ఒకే రోజున విడుదలవుతున్న విషయంపై సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు.
Details
రెండు సినిమాలను చూస్తానంటున్న పృథ్వీరాజ్ సుకుమారన్
రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజ్ కావడం ఒక సినిమా లవర్ గా తనకు చాలా ఉత్సాహంగా ఉందని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలియజేశారు.
ఈ రెండు సినిమాల కథలు డిఫరెంట్ గా ఉండబోతున్నాయని, తాను రెండు సినిమాలు చూస్తానని, అందుకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు.
అంతేకాదు హాలీడే సీజన్లో రెండు పెద్ద సినిమాలు రావడం చాలా రోజుల క్రితం జరిగిందని, 2023లో ఇలాంటి సంఘటన జరగబోతుందని ఇండియన్ సినిమాను ఇలా సెలబ్రేట్ చేసుకోవడం బాగుంటుందని సలార్ యాక్టర్ చెప్పుకొచ్చారు.
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సలార్ సినిమాలో జగపతిబాబు, ఈశ్వరి రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.