
ఐమ్యాక్స్ ఫార్మాట్లో సలార్: కేవలం అక్కడ మాత్రమే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం సలార్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆదిపురుష్ తీవ్రంగా నిరాశపరచటంతో తమ ఆశలన్నీ సలార్ మీదే పెట్టుకున్నారు.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సలార్ సినిమా రికార్డులు తిరగరాస్తుందని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు.
తాజాగా సలార్ సినిమా నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది. సలార్ సినిమాను అభిమానుల కోసం ఐమ్యాక్స్ ఫార్మాట్లో తీసుకొస్తున్నారు.
ఈ విషయాన్ని అమెరికన్ డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడి చేసింది. అంతేకాదు మరికొన్ని రోజుల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని ఊరించింది కూడా. దీంతో ప్రభాస్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు.
Details
ఇండియాలో ఐమ్యాక్స్ ఫార్లాట్లో వస్తుందా?
అయితే సలార్ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్లో ఇండియాలో అందుబాటులో ఉంటుందా ఉండదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అమెరికాలో మాత్రం ఐమ్యాక్స్ ఫార్మాట్లో సలార్ ని ఎంజాయ్ చేయవచ్చు.
ఇండియాలో కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్లో తీసుకొస్తే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పటివరకు బాహుబలి 2 సినిమా, ఐమ్యాక్స్ ఫార్మాట్లో రిలీజ్ అయింది. ఆ లిస్టులో సలార్ కూడా చేరిపోనుంది.
హాంబలే ఫిలిమ్స్ బ్యానర్లో రూపొందుతున్న సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా కనిపిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.