Page Loader
Salaar-Prabhas-Tv: టీవీలో టెలికాస్ట్ కానున్న ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్

Salaar-Prabhas-Tv: టీవీలో టెలికాస్ట్ కానున్న ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్

వ్రాసిన వారు Stalin
Apr 14, 2024
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సలార్ ‌‌-ద సీజ్ ఫైర్ (salaar) సినిమా ఈ నెల 21 ఆదివారం స్టార్ మా లో ప్రసారం కానుంది. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో కేజీఎఫ్ (KGF) డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prasanth Neel) రూపొందించిన సలార్ సినిమా గతేడాది డిసెంబర్ లో విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది.

Salaar-Star Maa Tv

కల్కి 2898 పూర్తికాగానే సలార్​ కు సీక్వెల్​.. 

వచ్చే ఆదివారం సాయంత్రం ఐదుగంటలకు స్టార్ మా చానల్ లో ప్రసారం కానున్న ఈ సలార్ మూవీ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా ప్రభాస్ తాజాగా నటిస్తున్న కల్కి 2898 సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే సలార్ 2 సీక్వెల్ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశారని ఇండస్ట్రీ టాక్ .